- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దయ్యాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 9వ తరగతి, ఆ పై తరగతుల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మహా సర్కార్ తెలిపింది. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబైలోనూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజూ దాదాపు 40 వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రంలో 29 లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉంది.
Maha Govt promoted 1-8 students without exams
- Advertisement -