ముంబై: మహారాష్ట్రలో ఐదు విడతల్లో అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఆంక్షలను సడలించబోతున్నట్టు శుక్రవారం రాత్రి ప్రభుత్వం తెలిపింది. సోమవారం నుంచి ఐదు విడతల్లో అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తామని పేర్కొంది. కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీల ఆధారంగా జిల్లాల వారీగా లాక్ డౌన్ ఆంక్షలను సడలించనున్నట్లు చెప్పింది. గైడ్ లైన్స్ ప్రకారం కరోనా పరిస్థితులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రతి గురువారం అంచనా వేయనుంది. తొలి విడతలో పాజిటివిటీ 5 శాతం లేదా అంతకంటే తక్కువ, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో పూర్తి స్థాయిలో అన్ లాక్ జరుగుతుందని, తిరిగి అన్ని కార్యకలాపాలు సాదారణంగా కొనసాగించుకోవచ్చని తెలిపింది. రెస్టారెంట్లు, మాల్ లు, థియేటర్లు, క్రీడా మైదానాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సెలూన్లు, షాపులు ఓపెన్ చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Maha Govt to lift lockdown restrictions from Monday