Thursday, January 30, 2025

త్రివేణి సంగమం వైపు వెళ్లకండి… ఆ ఘాట్ల వద్ద స్నానాలు చేయండి: యోగి

- Advertisement -
- Advertisement -

లక్నో: మహాకుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో భక్తులకు యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. గంగామాతకు సమీపంలోని ఘాట్ వద్ద స్నానాలు చేయాలని సూచించారు. త్రివేణి సంగమం కేంద్రం వైపు వెళ్లి మొక్కులు చెల్లించడానికి ఎవరూ వెళ్లందంటూ భక్తులను కోరారు. అమృత స్నానం కోసం చాలా ఘాట్‌లు ఏర్పాటు చేశామని, అక్కడ స్నానాలు చేయాలని కుంభమేళాలో ప్రచారం చేశారు. మౌని అమవాస్య సందర్భంగా యుపిలోని ప్రయాగ్ రాజ్ కు  భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మృతి చెందగా 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News