- Advertisement -
న్యూఢిల్లీ : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులోకోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా విఐపీల కదలికలు ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది.
- Advertisement -