Thursday, January 23, 2025

మహాశివరాత్రి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో తెలుసా..?

- Advertisement -
- Advertisement -

శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండి వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. మహా శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా చేయాల్సినవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది.
శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులౌతారని స్కాంధ పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వల్ల ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో చెప్పాడు.

ఉపవాస విశిష్టత
జీవుడు పరమాత్ముని సామీప్యంలో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవలం భగవంతుని ఆరాధన చేయడమే ఉపవాసమని వరాహోపనిషత్తు చెబుతోంది.

రుద్రాభిషేకం
మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే రుద్రాభిషేకంలోని పరమార్ధం.

పంచాక్షరి మంత్రం
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు నమ శివాయ(ఓం నమశ్శివాయ)లను మహాశివరాత్రి నాడు భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. వీటితో పాటు మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అందువల్ల మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని శివ పురాణం అవగతం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News