Sunday, November 17, 2024

నేటి నుంచి మహాశివరాత్రి జాతర

- Advertisement -
- Advertisement -

ఐదురోజుల పాటు ఉత్సవాలు
జిల్లాలోనే ప్రత్యేక మైన శివాలయం
ప్రధాన ఆకర్షణగా లైటింగ్ ప్రభలు ,ఎందుల పందేలు

మన తెలంగాణ/మేళ్లచెరువు, మేళ్లచెరువు రూరల్ : మేళ్లచెరువు మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ్దిగా ంచింది. ఇక్కడ శివలింగంపై భాగంలోని రంథ్రం నుండి నిత్యం గంగ ప్రవహిస్తుంది .శివలింగం ప్రతి ఏటా ఎత్తు పెరుగుతుంది.అర్ధనారీశ్వర రూపంలో పార్వతీ దే వి అ మ్మవారి జడలు ,ఆనవాళ్లు ,కాకతీయుల కాలంలో ని ర్మించిన ఈ ఆలయానికి ఏళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 1233 సంవత్సరంలో కాకతీయ రాజు ప్రతాప రుద్రుని కా లం లో ఈ ఆలయం నిర్మించినట్లు శాసనాలు చెప్పుతున్నా యి.ఇక్కడి శివలింగం ఐదు అడుగుల రాతిపై ఉం టు ం ది. నిత్యం శివలింగం తలపైన రంథ్రం నుంచి ని త్య ం నీ రు ప్రవహిస్తుంటాయి.ఎన్ని నీళ్లు తీసినా మళ్లీ ఉద్వవిస్తా యి. ఈ శివలింగం వెనుక భాగాన జడను పోలిన చా ర లు ఉండటంతో ఇక్కడి ప్రజలు శివుడిని అర్ధనారీశ్వరుని గా కొలుస్తారు. మహాశివరాత్రిజాతర సందర్భంగా ఆలయంలో ఐదు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి దర్శించుకోనేందుకు రెండు తెలుగు రాష్టాల్లో ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తారు.
లైటింగ్ ప్రభలు ప్రత్యేకం: జాతర సందర్భంగా గ్రామస్తులు వంద అడుగుల భారీ లైటింగ్ ప్రభలను పోటీ పడి ఏర్పాటు చేస్తారు.శివరాత్రి ముందు రోజు గ్రామంలో ప్ర భలను ఊరేగించి శివరాత్రి రోజున ఆలయ ప్రాంగణ ం లో సంప్రదాయ నృత్యాలను నిర్వహిస్తారు. అదేరోజు స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. లక్షల మంది భక్తు లు రాత్రి జాగారం ఉండి స్వామి వారి కల్యాణంలో మ హోత్సవంలో పాల్గొంటారు.
అలరించే కబడ్డీ , ఎద్దుల పందేలు : జాతరలో భాగంగా రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు , కబడ్డీ పోటీలను ప్రతి ఏటా అనవాయితీగా నిర్వహిస్తారు.గుంటూరు , ఒంగోలు ప్రా ంతాల నుంచి ఎద్దుల పందేల్లో పాల్గొనెందు కు పెద్ద సైజు ఎద్దులను రైతులు తీసుకువస్తారు. ఈ సంవత్సరం ఐదులక్షల వి లువ గట ట్రాక్టర్‌ను ప్రథమ బహుమతిగా ప్రకటించడ ంతో ఈ సారి ఎ క్కువ ఎద్దుల జ తలు పోటీల్లో పా ల్గొనే అవకాశం ఉ ంది. దీంతోపాటు రా ష్ట్రస్థాయి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్‌ను నిర్వ

హించారు. ఖర్చుతో కూడుకున్నప్పటికీ మ్యాట్ ,ఫ్లెడ్ లైట్ల వెలుగులో టివి తెరలను ఏర్పాటు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో చి న్నారుల కోసం , సర్కస్ , బొమ్మల కొ లువులు అలరిస్తాయి. రెండు రాష్ట్రాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోకుండా ఎస్పి భాస్కరన్ ఆ ధ్వర్యంలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News