రామాంజనేయులు/మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జిల్లాలో ఒకప్పుడు హీరోలు.. రాజకీయాల్లో అందవేసిన చేతులు..వారు ఏది చెబితే అదే శాసనం..రాజకీయాల్లో తలపండిన నేతలు. . తమ తమ వాగ్దాటిలో మించిన వారు లేరని చె ప్పాలి.. రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజకీ య నేతలు.. నాటి తెలుగుదేశం పార్టీ నేతలు.. అ ప్పటి టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి కుడిభుజాలుగా ఉం టూ చ క్రం తిప్పిన నేతలు. వారే నాగం జనార్దన్ రెడ్డి. రావుల చంద్రశేఖర్, మందా జగన్నాథంలు. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో వీరి పేర్లు తెలియని వారు ఉండరు. కానీ కాలం కలిసిరాకపోతే ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే మరి..ఒకప్పుడు టిడిపిలో సీనియర్ నేతలుగా ఉన్న ఈ నేతలందరూ ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.
నాగం జనార్దన్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి. ఈయన నాగర్ క ర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి 1985, 1994,1999,2004, 2009, 2012 వరుసగా ఆరు సార్లు విజయ ఢంకా మోగించిన నేత. ఎన్‌టిఆర్‌తోనూ, ఆయన మరణాంతరం చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్నారు. అనేక ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పని చేశారు. నియోజకవర్గ అభివృద్ధ్దిలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రత్యేక తెలంగాణా ఉద్య మం నేపథ్యంలో రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆయన టిడిపి ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బిజెపి పార్టీలోనూ కొనసాగారు. అక్కడ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇటీవల టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ దక్కక పోవడంతో ఇటీవలనే సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లోకి చే రారు. ఒకప్పుడు హీరోగా వెలిగిన నేత ఇప్పుడు తనకంటూ ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది చూడాల్సి ఉంది.
రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి జిల్లాలో పేరున్న నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయ మేధావి. ఏ విషయాన్నైనా క్షుణ్ణం గా విశ్లేషించగల నేత.. సౌమ్యుడు అనే పేరుంది. ఈయన వనపర్తి నియోజకవర్గం నుంచి 1994. 2009లో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసా రి రాజ్యసభకు ఎన్నికయ్యారు. టిడిపిలో సీనియర్ నేత. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలంగాణాలో టిడిపి నుంచి అం దరూ వెళ్లిపోయినా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మా త్రం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. టిడిపి పొలి ట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు.బాబుకు అంత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. ఇటీవలనేముఖ్యమం త్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.
మందా జగన్నాథం
మంద జగన్నాథం కూడా టిడిపిలో సీనియర్ నే తగా ఉంటూ వచ్చారు. సీనియర్ పొలిటిషియన్. నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి 1996, 1999, 2004, 2009 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్లెమంట్ పరిధిలో పలు అభివృద్ధి ప నులు చేపట్టారు. తెలంగాణా ఉద్యమంలో కీలకం గా పని చేశారు.
ఈ సమయంలోనే టిఆర్‌ఎస్‌లో చేరా రు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాం గ్రెస్ నేత నంది యల్లయ్య చేతిలో ఓటమి చెం దా రు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా లేకు న్నా బిఆర్‌ఎస్‌లో కొనసాగారు. 2014లో తమ కుమారునికి అలంపూర్ టికెట్ ఇప్పించు కు న్నా కుమారుడిని గెలిపించుకోలేక పోయారు. అ యినప్పటికి ముఖ్యమంత్రి కెసిఆర్ మందా జ గన్నాథంకు రాష్ట్రం నుంచి ఢిల్లీలో ప్రత్యేక ప్రతి నిధిగా నియమించారు. ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు.