కేంద్ర ఎన్నికల కమిటీలో పరిశీలన
పట్టుబడుతున్న డికె అరుణ, ఎపి జితేందర్ రెడ్డి
మొదటి విడుతలో డికె అరుణ టికెట్ రాక పోవడంతో అనుమానాలు
రెండో విడుతలోనూ డౌటే
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయింపు
బిసిల ఓట్లపై బిజెపి ప్లాన్
ఈ కోవలోనే శాంతికుమార్‌కు అవకాశం కలిసొచ్చేనా ?
పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్‌ఎస్, బిజెపిలు ఫోకస్ పెంచాయి. ఆరోపణలు, పత్యారోపణలతో ఎన్నికల ఉస్ణోగ్రతలు మరింత హీట్‌ను పెంచుతున్నాయి. ఇప్పటికే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని చల్లా వంశీచందర్‌రెడ్డిని ప్రకటించి దూకుడుగా ఉంది.ఇక బిఆర్‌ఎస్ అభ్యర్ధిని సిట్టింగ్ ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. ఇక మిగిలింది బిజెపినే. ఈ పార్టీ కూడా మరో రెండు రోజుల్లో రెండో విడుత అభ్యర్థుల ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు పార్లమెంట్‌పై బిజెపి నుంచి ప్రధానంగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్‌లు పోటీ పడుతున్నారు. మొదటి విడుతలోనే టికెట్ ఆశలు పెట్టుకున్న డికె అరుణకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. జాతీయ ఉపాధ్యక్షురాలి హాదాలో ఆమెకు మొదటి విడుతలోనే టికెట్ రావాల్సి ఉన్నా ఎందుకు రాలేదన్న సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
– మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో
నాగర్ కర్నూలు నుంచి ఇటీవల కొత్తగా పార్టీలోకి చేరిన భరత్‌కు మొదటి విడుతలోనే టికెట్ కేటాయించిన అధిష్టానం డికె అరుణ విషయంలో ఎందుకు నిలిపి వేసిందన్నది అం తు బట్టని విషయంగా మారింది. ఇక రెండవ విడుతలోనైనా తమ పేరు ఉంటుందా అని ము గ్గురు నేతలు వెయ్యి కల్లతో ఎదురు చూస్తున్నారు.
బిజెపి బాద్‌షా శాంతికుమారేనా ?
పాలమూరు పార్లమెంట్‌పై ముగ్గురు నేతల మద్య బిసి సామాజిక వర్గం నేతగా ఉన్న పార్టీ సీనియర్ నేత శాంతికుమార్ పేరును కేంద్ర ఎ న్నికల కమిటీ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ స మాచారం. ఇప్పటికే సర్వేలు, ఇంటిలిజెన్సీ ని వేదికలు తెప్పించుకున్న బిజెపి అధిష్టానం బి సిల వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాజీ ఎంపి జితేందర్ రెడ్డి విషయంలో ఇప్పటి కే తన కుమారుడికి పాలమూరు అసెంబ్లీ టి కెట్ కేటాయించడం తెలిసిందే. అలాగే డికె అ రుణ గద్వాల నుంచి పోటీ చేయాలని అధిష్టా నం అవకాశం ఇచ్చినా ఆమె అక్కడ పోటీ చే యలేదు. అయితే అక్కడ తమ అల్లుడు బిఆర్ ఎస్ అభ్యర్థి బండ్ల కృష్నమోహన్ రెడ్డి గెలుపు కోసం, బిజెపి నుంచి బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో నిలబెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి.
అయితే గద్వాల్లో కనీ సం పోటీకి నిలబెట్టిన అభ్యర్ధికి కనీసం డి పాజి ట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలి గడ్డలో బిజెపి డిపాజిట్ కూడా దక్కక పోవడాన్ని ఆ పార్టీ నేతలు సైతం జీర్ణి ంచుకోలేక పోతున్నారనే వాదనలు ఉన్నాయి. అదే విధంగా పాలమూరు పార్లమెంట్ పరిధి లో అనుకున్నంత స్థాయిలో ప్రచారం కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. మఖ్తల్, నా రాయణ పేట నియోజకవర్గాల్లో తమ కుటుం బ సభ్యులు బిఆర్‌ఎస్ నుంచి ఒకరు,కాంగ్రెస్ నుంచి మరొకరు ఉండడంతో వారి గెలుపు కో సం అరుణ పరోక్షంగా పని చేసిందన్న విమర్శ లు పార్టీలో కొనసాగాయి. ఇలాంటి నేపథ్యం లో పార్టీలోని కొందరు పార్టీ రాష్ట్ర కమిటికి, కేంద్ర కమిటీకి నివేదికలు పంపినట్లు తెలుస్తోం ది. ఇక ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉ న్న శాంతికుమార్ పార్లమెంట్ సీటు కోసం రెం డు సార్లు త్యాగం చేశారు. ఈ సారి ఖచ్చితంగా తనకే కావాలని ఆయన పట్టు బడుతున్నారు. బిసి వాదాన్ని తెరపైకి తెస్తున్నారు.
బిజెపి కూ డా బిసిల పట్ల సానుకూలంగా ఉంటున్న నేప థ్యంలో బిసిగా ఉన్న శాంతికుమార్ పట్ల సాను కూలంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకు లు భావిస్తున్నారు. అంతేకాకుండా శాంతికు మార్‌పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేక పోవడం, ఆయన సొంత కుటుంబాన్ని కూడా వదలి పార్టీ కోసం సేవ చేస్తున్నారు. దేశం కో సం ప్రధాని కుటుంబాన్ని వదలి సేవ చేస్తున్నా రో ఇక్కడ శాంతికుమార్ పాలమూరు మోది గా మారి కుటుంబాన్ని వదలి పార్టీ కోసం సే వలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన పేరును అధిష్టానం సీరియస్‌గానే పరిశీలిస్తున్న ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్,బిఆర్‌ఎస్ పార్టీలు రె డ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించ డం తో బిసిలు అధికంగా ఉన్న పాలమూరు పార్ల మెంట్‌లో బిసికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్న ట్లు సమాచారం. సుమారు 65 శాతం జనాభ ఉన్న బిసిలకు టికెట్‌లు కేటాయించాలని పలు బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ఓటు బ్యాంక్ కాదని, చట్ట సభల్లో కూడా బిసిలకు అవకాశం కల్పించాల్సిన అవసరం బిజెపికి ఉందని బిసి సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. టికెట్‌ల వ్యవహారం మరో రెండు రోజుల్లో బయట పడే అవకాశం ఉంది.