Friday, December 20, 2024

జడ్చర్లలో డిసిఎంను ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు… దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతం బురెడ్డిపల్లి దగ్గర సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరం వెళ్తున్న ఎపిఎస్ఆర్ టిసి బస్సు డిసిఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ తోపాటు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బస్సు దిగడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి వెనుక నుంచి డిసిఎం ను ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News