Wednesday, January 22, 2025

భార్యను కొట్టి.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి విషం తిని…

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త తన కుమారులకు విషం తినిపించి తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా అమనగల్‌లో జరిగింది. ఈస్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. బలరామ్‌తండాలో రమేష్-శాంతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు(విఘ్నేష్(6), రాజ్‌కుమార్(3)) ఉన్నారు. గత కొంత కాలం భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Also Read: అన్నదాతల ఆత్మబంధువు

బుధవారం దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త తీవ్రంగా కొట్టాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రమేష్ బత్తాయిలు తీసుకొచ్చాడు. బత్తాయి ముక్కల్లో విషం కలిపి తన కుమారులకు ఇచ్చాడు. బత్తాయిల నుంచి వాసన రావడంతో తన నానమ్మకు దస్లీకి విషయం చెప్పాడు. గ్రామస్థులకు చెప్పి ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. రెండు బత్తాయి ముక్కలు పక్కింటి బాలిక తినడంతో ఆమె కూడా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజ్ కుమార్ మృతి చెందగా విఘ్నేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News