Monday, December 23, 2024

మహబూబాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : తెలంగాణ 33 జిల్లాల చరిత్ర సంస్కృతి, భాషా, సాహిత్యాలు, పురావస్తు కట్టడాలు, జిల్లా ప్రముఖులు తదితర వివిధ రంగాల గురించి తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో రూపొందిన మహబూబాబాద్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథావిష్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఐ.డి.ఓ.సిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్సీ టి. రవీందర్‌రావులు ముఖ్య అతిధులుగా పాల్గొని పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ.. జిల్లా అస్తిత్వం, చరిత్ర సంస్కృతి, సాహిత్య వైభవాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఇప్పటి తరానికి తెలుపాల్సిన అవసరం ఉందన్నారు.

తల్లితండ్రులు తమ పిల్లలకు వివిధ అంశాలపైన పుస్తక పఠనం అలవాటు చేయాలని, మనదైన సాహిత్యం, సమాజం, నైతిక విలువలు, మానవ సంబంధాల గురించి బాల్యంలోనే అవగాహన కలిగించాలని సూచించారు. మన జిల్లా ప్రాచీన, ఆధునిక సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంపదను 56 వ్యాసాల రూపంలో నిక్షిప్తం చేఇన సారస్వత పరిషత్తు వారి కృషి అభింనందనీయమన్నారు. ప్రభుత్వం ద్వారా ఈ గ్రంథాలను కొనుగోలు చేసి విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో మహబూబాబాద్‌కు ప్రత్యేక విశిష్టమైన స్థానం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రత్యేకతను గుర్తించే సీఎం కేసీఆర్ జిల్లా ఏర్పాటైందన్నారు. మనుషుల మధ్య సంబంధాలు క్షీణించి పోవడం సమాజానికి మంచి పరిణామం కాదన్నారు. మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, సత్సంబంధాలు ఉన్నప్పుడే ఆత్మహత్యలు, పరస్పరం కలహాలు నివారించడం సాధ్యమని అన్నారు.

తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి. రామారావు, సహకారశాఖ జిల్లా అధికారి సయ్యద్ ఖుర్షీద్, కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ మద్దెర్ల రమేష్, సభ్యులు గుండెల రాజు, భువనగిరి రవీంద్రగుప్త, పొన్నాల ఉపేందర్, వి. అయోధ్యరామయ్య, గుండోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావులతో పాటు వ్యాస రచయితలు, కోర్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News