Saturday, November 2, 2024

సచివాలయం వద్ద మహబూబాబాద్ రైతుల ధర్నా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సచివాలయం వద్ద మహబూబాబాద్ రైతులు ధర్నాకు దిగారు. సాగు చేసుకుంటున్న తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని అధికారులకు విన్నవించుకునేందుకు సోమవారం సచివాలయానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులను సచివాలయంలోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు ధర్నాకు దిగారు. తమ గ్రామాన్ని అటవీశాఖ పరిధిలో కలిపేశారంటూ నిరసన తెలిపారు. అన్ని అనుమతులు ఉన్న నవీన్ మిట్టల్ వినడం లేదని గ్రామస్తుల ఆరోపించారు.

సుమారు 200 ఎకరాల భూమిలో అటవీశాఖ క్లియరెన్స్ ఇచ్చినందున సాగు చేసుకుంటున్న రైతులకు సర్వే చేసి నూతన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అధికారులకు పలు మార్లు విన్నవించినట్లు తెలిపారు. తమ భూముల ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. రైతులు ధర్నాకు దిగడంతో వారిని సచివాలయంలోకి అనుమతించారు. దీంతో వారు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు అనంతరం నారాయణపురం ఎంపిటిసి ధరావత్ రవి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News