Monday, January 27, 2025

మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Mahabubabad Municipal councilor brutally murder

పత్తిపాక: మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురైన సంఘటన పత్తిపాకలో గురువారం చోటుచేసుకుంది. 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవిని దుండగులు గొడ్డలితో నరికి ప్రాణాలు తీశారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న కౌన్సిలర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని స్థానికులంటున్నారు. తీవ్రంగా గాయపడిన రవిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మహబూబాబాద్ ఎస్పీ స్పందించారు. కౌన్సిలర్ రవిబైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ అడ్డం పెట్టి ఆపారని పేర్కొన్నారు. దుండగులు కారులో వచ్చి గొడ్డలితో దాడి చేశారని చెప్పారు. ఈ హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని, రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు వెతుకుతున్నాయని, ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. త్వరలోనే నిందితులందరిని అరెస్ట్ చేస్తామని శరత్ చంద్ర పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News