- Advertisement -
మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజనతండా సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మజ్యోతిబాపూలే పాఠశాలలో పార్థసారిథి అనే వ్యక్తి హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. భజతండా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పార్థసారథిని గొడ్డలితో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు భద్రాచలంకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు.
- Advertisement -