Friday, January 10, 2025

మహబూబ్ నగర్ ఎంఎల్ సి ఓట్ల లెక్కింపు వాయిదా

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్ సి ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఈసి ఆదేశాలు జారీ చేసింది. గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ జరిగాక తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎంఎల్ఏగా గెలుపొందారు. ఆయన తన ఎంఎల్ సి పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక తప్పనిసరయింది. మన్నె జీవన్ రెడ్డి(కాంగ్రెస్), నవీన్ కుమార్ రెడ్డి(భారాస), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర అభ్యర్థి) పోటీపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News