ఎసరు ఎవరికి..ఛాన్స్ ఎవరికి
టికెట్ల వేటలో నేతల పాట్లు
బిఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకు గ్యారెంటేనా?
ఉమ్మడి జిల్లాలో కొందరికి ఉద్వాసన తప్పదంటున్న విశ్లేషకులు 8బిజెపిలో పొసగని విబేధాలు 8జితేందర్‌రెడ్డి,డికె అరుణ మధ్య తీవ్రమైన విభేధాలు!
మధ్యన బిసి నేత శాంతకుమార్‌కు ఈ సారి అన్యాయమేనా ?8కాంగ్రెస్‌లో
పాదయాత్రలు కలిసి వస్తయా ?
ఈ నేతల దారి ఎటు?
సితా, దయాకర్‌రెడ్డి, డిఎస్‌పి కిషన్‌ల పయనమెటో ?
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: ఎండకాలం ప్రారంభం అవుతున్న సందర్భంలోనే ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది. దాదాపు అ న్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికలు ము ందస్తు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే ఎన్నికలు ఎప్పడు వచ్చినా ఎదుర్కొనేందుకు రాజకీ య పార్టీలు కసరత్తులు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే హత్‌సే హత్ జోడో పేరుతో కాంగ్రెస్ పాదయాత్రలు చేపడుతుండగా, బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళ నం పేరుతో సదస్సులను ప్రారంభించింది. బిజెపి లోలోపల ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఇక బిఎస్‌పి కూడా తాను కూడా రంగంలో ఉంటానని సంకేతాలు పంపుతోంది. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. టికెట్ల కోసం ఎవరి ప్రయత్నా లు వారు చేసుకుంటున్నారు. బిఆర్‌ఎస్ నుంచి ము ఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తా రా లేక కొత్తవారికి కేటాయిస్తారా అన్నది కూడా అంచనా వేయలేక పోతున్నారు. ఒక వేల సిట్టింగ్‌లను మార్చితే తమకు టికెట్ వస్తుందని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
బిఆర్‌ఎస్‌లో పోటా పోటీ:
ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్‌ఎస్ నుంచి అనేక మంది ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌లో ఉన్న విబేధాలు కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నడిగడ్డ ప్రాంతంలో బిఆర్‌ఎస్‌లో లుకలుకలు పెద్దగానే ఉన్నా యి. గద్వాలలో ఎమ్మెల్యేకి, జడ్‌పి చై ర్మన్‌కు విబేధాలు ఉన్నాయి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయన్నది అనుమానంగా ఉంది. అలాగే అలంపూర్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యే అ బ్రహంకు కూడా అసమ్మతి రాజుకుంటోంది. ఇక్కడి నుంచి గోదాముల చైర్మన్ కళాకారుడు సాయిచంద్ పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అలంపూర్ నుంచి చల్లా వెంకటరెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన మద్దతు దారుల బలం ను బట్టే వారికి టికెట్ వచ్చే అవకాశా లు ఉన్నాయి.
వనపర్తి జిల్లాలో కూడా మంత్రికి,జిల్లా పరిషత్ చై ర్మన్‌కు సొగసడం లేదు. కొల్లాపూర్‌లోనూ ఎ మ్మెల్యే బీరంకు వ్యతిరేకంగా మాజీ మం త్రి జూపల్లి ఉండనే ఉన్నారు. జూప ల్లి ఇంకా ఎటు నిర్ణయం తీసుకోక పోవడంతో ఆయన పార్టీలో ఉంటాడా, ఊడుతాడా అన్నది కూడా సందిగ్దంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యేకు తిరుగు లేక పోయినప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న అసమ్మతి గలం కూడా ఉంది. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వలతో పాటు ఎంపి రాములు తమ కుమారుడి ని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు.ఇక కల్వకుర్తిలో ఎమ్మె ల్యే జైపాల్ తో పాటు ఈ సారి ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆశిస్తున్నారు. జడ్చర్ల నుంచి ప్రస్తు త ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, టిటిడి మెంబర్ మన్నె జీవన్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అసమ్మతి లేక పోయినప్పటికీ లోలోపల ఇతర నేతలు కూడా ఆశిస్తున్నారు.
దేవరకద్ర నుంచి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి తిరు గు లేక పోయినప్పటికీ లోలోపల ఉన్న అసమ్మతి తో కొంత ఇబ్బంది వాతావరణమే ఉన్నది.మఖ్తల్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే చిట్టెంతోపాటు మరి కొంద రు ద్వితీయ శ్రేణి నాయకులు ఆశిస్తున్నారు. మఖ్త ల్ నుంచి దేవరిమల్లప్ప,వర్కటం వంటి నేతలు ఆశిస్తున్నారు. నారాయణపేట నుంచి ఎమ్మె ల్యే రాజేందర్ రెడ్డితో పాటు ద్వితీయ శ్రేణిలో ఎం పిపి అమ్మకొలు శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా బిఆర్‌ఎస్‌లో ఒకరిద్దిరిని మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నా యి. వారు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
కాంగ్రెస్‌లో ఎవరి దారి వారిదే…
హత్స్‌సే హత్ జోడో పేరుతో ఉమ్మడి జిల్లాలో ఎవరికి వారు పాదయాత్రలు చేపడుతున్నారు. ఇంటింటికి కా ంగ్రెస్ అంటూ తిరుగుతున్నారు. కొన్ని ని యోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరన్నది అంతు చి క్కడం లేదు. మహబూబ్‌నగర్‌కు ఇంత వరకు ఎవరన్నది తేలలేదు. జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్, అనిరు ధ్ రెడ్డి ఆశిస్తున్నారు. దేవరకద్రనుంచి జిఎంఆర్‌తో పాటు ప్రదీప్‌గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. మఖ్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డి, నారాయణపేట పిసిసి అధ్యక్షెడు వా కిట శ్రీహరి ఆశిస్తున్నారు. నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డితో పాటు మరి కొందరు ఉన్నారు. గద్వాల నుంచి సీనియర్ నేత పటేల్ ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలంపూర్ నుంచి పిసిసి నేత సంపత్‌కుమార్ ఉన్నారు. వనపర్తి ఎవరు బరిలో ఉంటారన్నది స్ప ష్టత రావడం లేదు. కొల్లాపూర్ నుంచి అభిలాషరా వు ఆశిస్తున్నారు. నాగర్ కర్నూల్ నుంచి నాగం జ నార్దన్ రెడ్డి, అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి వంశీచందర్ రెడ్డి లైన్‌లో ఉన్నారు.
బిజెపిలో తప్పని వర్గ పోరు…
బిజెపిలోనూ టికెట్‌ల లొల్లి నడుస్తోంది. ముఖ్య ంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై పోటీ నెలకొంది. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఆ పార్టీ జాతీ య ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ మ ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ సారి మహబూబ్‌నగర్ నాది నాది అంటూ ఇరువురు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బిజెపి రాష్ట్ర అధిష్టానంలో నెలకొన్న విబేధాల కుంపట్లు ఇక్కడ కూడా రాజుకునే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ టికెట్ జితేందర్‌రెడ్డికిస్తారా లేక డికు అరుణకా లేక ఇరువురిని కాదని యన్నం శ్రీనివాస్ రెడ్డికి కేటాయిస్తారా అన్నది కూడా తేలడం లేదు. జడ్చర్ల కు బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ పేరు వినిపిస్తోంది. మ ఖ్తల్‌కు జలందర్‌రెడ్డి, నారాయణపేటకు ఈ సారి కొత్త పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక దేవరకద్ర నుంచి డోకూ ర్ పవన్‌కుమార్ రెడ్డి, సీడ్స్ సుధర్షన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గద్వాలకు డికె అరుణతో పాటు ఆమె కుమార్తె సిగ్దారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. వనపర్తి నుంచి ఎవరన్నది తేలలేదు. కొల్లపూర్ నుంచి సు రేందర్‌రెడ్డి లైన్‌లో ఉన్నారు. అచ్చంపేట, నా గర్ కర్నూల్‌లో ఇంకా అభ్యర్దులపై ఖరారు కాలేదు. నాగర్ కర్నూ ల్లో మాత్రం కోళ్ల పరిశ్రమకు చెందిన ఒక నేత పేరు వినిపిస్తోం ది. కల్వకుర్తి నుంచి ఆచారి డిక్లేర్ అయినట్లేనని చెబుతున్నారు.
వీరి పయనం ఎటు ?
రాజకీయాల్లో సీనియర్లగా ఉం టున్న కొందరు నేతలు, మరొక డిఎస్‌పి దారులు ఎటువైపు అ న్నది తేలడం లేదు. రాజకీయం లో సీనియర్లుగా ఉన్న మాజీ ఎ మ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలు గత కొంతకాలంగా టిడిపి ను ం చి దూరం అయినా ఏపార్టీలోకి వెళ్లకుం డా మధ్యస్దంగా ఉన్నారు. బిజె పి,కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేసినప్పటికీ స్పష్టత రావడం లేదు.దీంతో వారి రాజకీయ పయనం ఎటువైపు అన్నది నిర్ణయం కాలే దు.ఇక టిడిపిలో సీనియ ర్, పార్టీకి ఒకే ఒకడుగా ఉన్న రావు ల చంద్రశేఖర్ రెడ్డి ఈ సారి వనపర్తి నుంచి బరిలో ఉంటారని చెబుతున్నారు. అదే జరిగితే పరిస్థ్దితి ఏమిటన్నది చూడాలి. ఇక డిఎస్‌పిగా ఉంటూ ప్ర స్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న కిషన్ ఏ పార్టి నుంచి వస్తారన్నది ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. దేవరకద్ర నుంచి పోటీ లో ఉంటానం టూ ఆయన చెబుతున్నా పార్టీపై స్ప ష్టత రావడం లేదు. అయితే అయన ఇప్పటికే దేవరకద్రలో చురుకుగా తిరుగుతున్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపినా, బిఆర్‌ఎస్ పార్టీనా అన్నది తేలడం లేదు. కిషన్ అయితే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద నేతలతో టచ్‌లో ఉంటున్నారు.