Monday, December 23, 2024

బఘేల్ ఆదేశాలతో దుబాయ్‌కు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తనను దుబాయ్ వెళ్లాలని చెప్పినట్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారంలో నిందితుడు శుభమ్ సోనీ తెలిపారు. బఘెల్‌కు వివాదాస్పద బెట్టింగ్ యాప్ నుంచి తరచూ ముడుపులు అందుతున్నాయని , తమ ప్రాధమిక విచారణలో ఈ విషయం నిర్థారితం అయిందని ఇడి ఇటీవల పేర్కొంది. తాము అదుపులోకి తీసుకున్న ఓ కొరియర్‌ను విచారిస్తున్నామని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారం రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇడి వర్గాల వాంటెడ్ వ్యక్తి అయిన సోనీ పేరిట దుబాయ్ నుంచి ఓ వీడియో వెలువడింది. తానే మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిజమైన ఓనరును అని ఈ వ్యక్తి ప్రకటించారు.

బఘైల్‌పై ఈ వ్యక్తి పలు ఆరోపణలకు దిగాడు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తాను పలుసార్లు ఇండియా, యుఎఇల మధ్య చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆసీమ్ దాస్ అనే కొరియర్‌ను ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాల క్రమంలో పట్టుకున్నారు. ఈ వ్యక్తి నుంచి రూ 5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి సోనీ ఈ డబ్బును సిఎం బఘేల్‌కు పంపించారని, తరచూ అక్కడి నుంచి బఘేల్‌కు ముడుపులు అందుతున్నాయని ఈ ఏజెంట్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సోని వీడియో వెలువడింది. బఘేల్‌పై ఆరోపణల నేపథ్యంలో ఇడి వర్గాలు కొన్ని బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశాయి. అరెస్టు అయిన కొరియర్ చెప్పిన దానిని బట్టి ఇప్పటివరకూ ముఖ్యమంత్రి బఘేల్‌కు రూ 509 కోట్లు ముట్టినట్లు ఇడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News