Sunday, January 19, 2025

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం నిందితుడి తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన మహదేశ్ బెట్టింగ్ యాప్ నిందితుడు అసిమ్ దాస్ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్గ్ జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన సుశీల్ దాస్ (62) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహదేవ్ యాప్ స్కామ్‌లో నిందితుడి తండ్రి. అతను రెండు రోజుల క్రితం కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. అచ్చోటి గ్రామం లోని ఓ బావిలో సుశీల్ మృతదేహాన్ని గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని దుర్గ్ పోలీస్ అధికారి రామ్‌గోపాల్ గార్గ్ తెలిపారు. సుశీల్ దాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు ఉంది. అయితే ఆయన ఆత్మహత్య వెనుక కచ్చితమైన కారణం తెలియరాలేదని పోలీస్‌లు వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక వస్తేనే కచ్చితమైన నిర్ధారణ వస్తుందని పోలీస్‌లు తెలిపారు.

అసిమ్ దాస్, భీమ్‌సింగ్ యాదవ్‌లను బెట్టింగ్ యాప్‌లో నిందితులుగా పేర్కొంటూ ఈడీ నవంబర్ 3 న అరెస్టు చేసింది. యాప్ ప్రమోటర్లు ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. రాయ్‌పూర్‌లో ఈడీ అసిమ్‌దాస్‌ను అరెస్ట్ చేసి రూ.5.39 కోట్లను స్వాధీనం చేసుకుంది. బెట్టింగ్ నిదులను ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుందని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో ఘోరపరాజయం చెందింది. ఇదే సమయంలో అసిమ్‌దాస్ తండ్రి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీస్‌లు విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News