Monday, December 23, 2024

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డు… యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో మహాదేవ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహాదేవ్‌పూర్‌లో మహిళ వసతి గృహం, పురుషుల వసతి గృహాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఓ మహిళ స్నానం చేస్తుండగా అశోక్ అనే వ్యక్తి బాత్ రూమ్ వెంటి లెటర్‌కు చిన్న రంధ్రం చేసి అందులో నుంచి వీడియో తీస్తుండగా స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. గత నాలుగు నెలల నుంచి మహిళలు స్నానం చేస్తుండగా ఏడు వీడియోలు తీసినట్టుగా అశోక్ మొబైల్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిపై ఐపిసి 354 సి సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News