Monday, December 23, 2024

ఓయూలో ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీక్‌ను నిరసిస్తూ విద్యార్థులు మహాధర్నాకు పిలుపు నివ్వడంతో ఓయూలో శుక్రవారం ఉద్రిక్తతతకు దారితీసింది. విద్యార్థి నిరుద్యోగ మార్చ్ పేరుతో విద్యార్థి సంఘాలు ఓయూలో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి, కానీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్ గేట్లను మూసివేశారు. అయినా కూడా విద్యార్థులు ఆర్ట్ కాలేజీ ఎదుట పూలదండలు వేసుకుని దీక్షకు దిగారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు దీక్షకు దిగిన వారిని అరెస్టు చేశారు. మహాదీక్ష వద్దకు వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా ఓయూలో ఒక్కసారిగి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నిరుద్యోగ మార్చ్, మధ్యాహ్నం నిరసన దీక్షకు పిలుపు నివ్వడంతో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థి నేతలను గురువారం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
ఉద్రిక్తంగా ఓయూ…
టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీక్‌ను నిరసిస్తూ వెంటనే చైర్మన్ జనార్దన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యుడిషియల్ విచారణకు పట్టుబడుతున్నారు. రెండు రోజులు ఆర్ట్ కాలేజీ ఎదుట మహాదర్నాకు పిలుపు నిచ్చారు. దీనికి అనుమతి లేదని యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా, దీక్ష చేస్తే అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా దీక్ష చేసి తీరుతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.

క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు వారి రాకను స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇంటి వద్ద అరెస్టు చేశారు. విద్యార్థులు ఇచ్చిన మహాధర్నా శనివారం కూడా ఉండడంతో ఓయూలో పోలీసులను భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News