Saturday, November 23, 2024

త్వరలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణాలో ఏర్పాటైన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. త్వరలో మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. మహాలక్ష్మి పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుంది. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి ప్రారంభించనున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణాకు మేలు జరుగుతుందని సజ్జనార్ తెలిపారు. కొవిడ్ వల్ల ప్రజారవాణాకు తీవ్ర విఘాతం కలిగిందన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News