Wednesday, January 22, 2025

దేశ చరిత్రలోనే మహాయజ్ఞం నిర్వహించడం ఇదే ప్రథమం: కొట్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: దేశ చరిత్రలోనే ఇంతటి మహాయజ్ఞం నిర్వహించడం ఇదే ప్రధమమని సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యాగం వైభవంగా జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. యాగ పూజా కార్యక్రమంలో కొట్టు పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది ప్రధాన ఆగమాలని అనుసరించి ఒకే దగ్గర దేవతామూర్తులకు యాగాలు నిర్వహించామన్నారు. ఒక్కొక్క యాగశాలలో 27 కుండలములతో మొత్తం 108 కుండలాలతో ఘనంగా యాగం నిర్వహించామన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన యజ్ఞం విజయవంతమైందన్నారు.

Also Read: భూమా అఖిల ప్రియ అరెస్టు

తెలంగాణ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రూ.220 కోట్లతో ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్‌కి సిఎం జగన్ ఆమోదిస్తూ కొన్ని మార్పులు చేశారని కొట్టు ప్రశంసించారు. తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని, వంద మంది ఒకేసారి వివాహాలు చేసుకునేలా కల్యాణ మండలం నిర్మిస్తామని, అలిపిరి తరహాలో ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ప్రారంభం ద్వారం నిర్మిస్తామన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు శ్రీశైలంలో మహాకుంబాభిషేకం నిర్వహించబోతున్నామని, మహా కుంబాభిషేకం కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొంటారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News