Monday, January 20, 2025

సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

సాయి దత్త క్రియేషన్స్ బ్యానర్‌పై మాస్టర్ పునీత్ కాడి, మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడి నిర్మాతగా శ్యామ్ మండల దర్శకత్వంలో వస్తోన్న సినిమా మహా లింగాపురం. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో హరీష్ వినయ్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ “ఈ సినిమాలోని సస్పెన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News