Friday, November 22, 2024

మతరాజకీయాలతో సమాజాన్ని విభజిస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

Mahamood ali comments on BJP

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి మత రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విభజిస్తోందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ఆసిఫ్ నగర్ సూరజ్ గార్డెన్ లో ఆదివారం నాడు బిజెపి సీనియర్ కార్యకర్త వాల్మీకి సమాజ్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్ సింగ్, ఇతర నాయకులు మంత్రి మహమూద్ అలీ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… బిజెపి అభివృద్ధి పేరుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఇప్పటివరకు సాధించింది ఏమిలేదని ఎద్దేవ చేశారు. కెసిఆర్ రైతుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు ఏ నాయకుడు అమలు చేసిన పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. రైతుబంధు, రైతు భీమా, రైతులకు ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలు ప్రవేశపెట్టి బంజరు భూములను సశ్యశ్యామలం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఆనంద్ కుమార్ గౌడ్, బండి రమేష్, నయాజి సాబ్, కలీమ్, బాసిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News