Wednesday, January 22, 2025

గోదావరిఖనిగా నామకరణం చేసిన మహానీయుడు గీట్ల జనార్ధన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

లక్ష్మినగర్: పారిశ్రామిక ప్రాంతానికి గోదావరిఖనిగా నామకరణం చేసిన మహానీయులు గీట్ల జనార్ధన్ రెడ్డి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. జనార్ధన్ రెడ్డి 85వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీనగర్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతానికి గీట్ల జనార్ధన్ రెడ్డి ఎంతో సేవ చేశారని అన్నారు. జనార్ధన్ రెడ్డి ఆశించిన విధంగానే రామగుండం నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆముల నారాయణ, నాయకులు నడిపల్లి మురళీధర్ రావు, లైశెట్టి రాజయ్య, దొమ్మేటి వాసు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News