Monday, December 23, 2024

17న మహంకాళి బోనాలు..

- Advertisement -
- Advertisement -

Mahankali bonalu on july 17th

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి  సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామన్నారు. ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

18న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతామన్నారు. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు చేస్తామని,  గతంలో కంటే అధికంగా భక్తులు రానున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News