Thursday, January 23, 2025

కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహాపడావు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మహాపడావు, జాతీయ సమ్మెమ ఆగస్టు 9, 10 తేదీలలో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శంకర్, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తైలి శ్రీనివాసులు మాట్లాడుతూ 2015 సంవత్సరంలో నరేంద్ర మోడి పార్లమెంట్ ఇచ్చిన కనీస మద్ధతు ధర హామి నేటికి అమలు కావడం లేదని,

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గాన్ని విచ్చిన్నం చేయడానికి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. అందులో భాగంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్‌పరం చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక రైతు విధానాలు విడనాడకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి చిన్నపాగ శ్రీనివాసులు, కొత్త రామస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, నాగరాజు గౌడ్, జిపి జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఏఐటియుసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News