- Advertisement -
గుజరాత్: 1982 నుంచి 1984 మధ్య భారత్ కు తొలి పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ జలా(88) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దిగ్విజయ్ సింగ్ జలా పర్యావరణ మంత్రిత్వ శాఖను స్థాపించారు. 1982 నుంచి 1984 వరకు భారత్ లో మొదటి పర్యావరణ మంత్రిగా పనిచేశారు. 1962-67 కాలంలో వాంఖనేర్ నుంచి తొలిసారి ఇండిపెండెంట్ ఎంఎల్ఎగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 1967-71 మధ్య సమాజ్ వాద్ పార్టీలో పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున 1979-1989 మధ్య రెండుసార్లు ఎంపి అయ్యారు. పర్యావరణంపై ఐక్యరాజ్యసమితిలోనూ ఆయన గళమెత్తారు.
- Advertisement -