Monday, December 23, 2024

ఈ రైలు టికెట్టు ధర రూ. 19 లక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ రైల్వేస్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్ను అని చెప్పొచ్చు. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఇతర మార్గాల్లో ప్రయాణం కన్నా ట్రైన్ జర్నీ బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అందుకే ముందుగానే టికెట్లను బుక్ చేసుకొంటూ ఉంటారు. టికెట్ కన్ఫార్మ్ అయితే ప్రయాణం కూడా సాఫీగా జరిగిపోయినట్లే. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం హాయిగా జర్నీ చేయొచ్చు.ఎంత దూరం ప్రయాణించినా వందలు.. మహా అయితే వెయ్యికి మించదు. అయితే, ఓ రైలు టికెట్టు మాత్రం ఏకంగా లక్షల్లో ఉంది.

ఆశ్చర్యంగా ఉంది కదా . మీరు విన్నది నిజమే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న ‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’ వివిధ మార్గాల్లో ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. ఇందులో ప్రయాణించాలంటే ఏకంగా రూ.19లక్షలకు పైనే ఖర్చవుతుందట. అందుకు తగ్గట్టుగానే వసతులు కూడా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News