Saturday, December 21, 2024

అత్త, బామ్మర్థిని చంపి… ఇల్లు తగలబెట్టి… మంటల్లో దూకిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: భార్యను తన వద్దకు పంపించడంలేదని అత్త, బామ్మర్థిని హత్య చేసి అనంతరం ఇల్లును తగలబెట్టి, మంటల్లో దూకి అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొన్ని నెలల క్రితం థాక్‌రే అనే యువకుడు లతా భొండే అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి థాక్‌రే కుటుంబంలో కలహాలు జరగడంతో పాటు అతడు ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి రావడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో కోడలు అత్తింటిని వదిలి పుట్టింటికి చేరుకుంది.

అత్తింటి వారికి తన భార్యను పంపించాల్సిదిగా అతడు కొరినప్పటికి వారు వ్యతిరేకించారు. దీంతో అల్లుడు అత్తింటిని తుదిముట్టించాలని నిర్ణయం తీసుకున్నాడు. పదునైనా ఆయుధాలతో అల్లుడు తన స్నేహితుడు బైక్ పై అత్తింటికి చేరుకొని అత్త, బామ్మర్థిని హత్య చేశాడు. అనంతరం ఇల్లును తగలబెట్టి మంటల్లో దూకాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News