Monday, December 23, 2024

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు
అధికారంపై కూటముల ధీమా
మహారాష్ట్రలో సిఎం పీఠంపై ఎవరికి వారే ప్రకటనలు

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. నేడు ఓట్ల కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభం కానుంది. 9 గంటల నుంచి ఫలితాల వెల్లడి ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగగా, మహరాష్ట్రలో 20న ఓకే విడతలో 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అధికార మహాయుతి(బిజెపి, శివసేన, ఎన్‌సిపి అజిత్ పవార్), విపక్ష మహా వికాస్ అగాఢీ(శివసేన ఉద్ధవ్, శరద్ పవార్ ఎన్‌సిపి, కాంగ్రెస్) కూటముల నడుమ హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి.

అయితే అధికార మహాయుతి వైపే ప్రజల మొగ్గు ఉన్నట్లు అత్యధిక సర్వేలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపి కూటమి కూడా ఈ సారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్నాయి. ఇక షిండే వర్గానికి చెందిన శివసేన ఎంఎల్‌ఎ సంజయ్ శీర్షత్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని, షిండే తిరిగి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అయితే బిజెపికి చెందిన ప్రవీణ్ దరేకర్ మాత్రం ఈ సారి మహాయుతి అధికారంలోకి వస్తే డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిఎం అవుతారని పేర్కొన్నారు. ఎన్‌సిపి నేత అమోల్ మిట్కారీ మాట్లాడుతూ డిప్యూటీ సిఎం అజిత్ పవార్‌కు ఈ సారి అత్యున్నత పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా అజిత్ వర్గానిదే కింగ్‌మేకర్ పాత్ర అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫడ్నవీస్ మాత్రం మహాయుతి కూటమి నేతల అంతా కూర్చుని ముఖ్యమంత్రి పీఠంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. మహా వికాస్ అగాఢీ అధికారంలోకి వస్తుందని, ఈ సారి కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు దక్కుతాయని.. తద్వారా సిఎం పీఠం మా పార్టీ నేతకే దక్కుతుందని మహారాష్ట్ర పిసిసి చీఫ్ నానా పటోల్ అన్నారు. ఇక జార్ఖండ్‌లో అధికార జెఎంఎ, ఇండియా కూటమి నేత్వతంలోని పార్టీలు ఎన్నికల బరిలో దిగగా, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ పార్టీలు గట్టి పోటీనిచ్చాయి. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ ఈ సారి ఎన్‌డిఎ అధికారంలోకి వస్తుందని చెప్పగా,జార్ఖండ్ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలకుగాను 1211 మంది అభ్యర్థులు బరిలో దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News