మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26న ముగుస్తుంది, జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025న ముగుస్తుంది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) మంగళవారం ప్రకటించనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.
288 సీట్ల మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది, అంటే అంతకు ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 5, 2025తో ముగుస్తుంది. దాదాపు 50 ఉప ఎన్నికలకు గడువు ఉన్నందున, ఎన్నికల సంఘం వాటి ఎన్నికల తేదీలను కూడా ప్రకటించవచ్చు.
వాటిలో వయనాడ్ లోక్‌సభ స్థానం కూడా ఉంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జూన్‌లో రాయ్‌బరేలీ , వాయనాడ్ రెండింటి నుండి గెలిచారు. తర్వాత ఆయన వాయనాడ్ సీటుకు రాజీనామా చేశారు. కాగా వాయనాడ్ స్థానానికి ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది.