Tuesday, December 24, 2024

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. మొదట పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనుంది సిబ్బంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నవంబర్ 20న ఒకే విడతలో మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య మహారాష్ట్రలో తీవ్ర పోటీ నెలకొంది. ఇక, జార్ఖండ్ లో రెండు విడతల్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఇక్కడ.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలకు కూడా శనివారం కౌంటింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా అందరి చూపు ప్రియాంకా గాంధీ పోటీ చేసిన వయనాడుపైనే ఉంది. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక తొలి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News