- Advertisement -
2 దశల్లో జార్ఖండ్ ఎన్నికలు
నవంబర్ 23న ఫలితాలు: ఈసిఐ
న్యూ ఢిల్లీ: ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వివరాలను ప్రకటించింది.
‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ అక్టోబర్ 22, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 29, నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 30, అభ్యర్థుల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీ’’ అని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
నవంబర్ 13, నవంబర్ 20న జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.
- Advertisement -