Monday, January 20, 2025

నేడు మహారాష్ట్రలో పోలింగ్

- Advertisement -
- Advertisement -

ఒకే దశలో 288 స్థానాలకు ఓటింగ్
జార్ఖండ్‌లో 38 నియోజకవర్గాల్లో ఎన్నికలు
23న ఫలితాలు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారంనాడు మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో , జార్ఖండ్ రెండో దశ పోలింగ్‌లో భాగంగా 38 స్థానాల్లో పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రెండు రాష్ట్రాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిటం చేశారు. మహారాష్ట్రలో ప్రధానంగా బిజెపి నేతృత్వంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన(ఉద్ధవ్) తదితర పక్షాలతో కూడిన మహావికాస్ అగాఢీ కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్‌లో మొత్తం 528మంది బరిలో ఉన్నారు. వీరిలో సిఎం హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ ప్రముఖుల్లో ఉన్నారు. విపక్ష నేత అమర్ కుమార్ బౌరి కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాని అధికార జెఎంఎంఇండియా కూటమి, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ పక్షాలు తలపడుతున్నాయి. జార్ఖండ్‌లో 31 పోలింగ్ స్టేషన్‌లలో 4గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ వినియోగించుకోవచ్చు. మరోవైపు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News