Friday, January 24, 2025

మహారాష్ట్రలో దూసుకుపోతున్న మహాయుతి కూటమి..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అధికార పార్టీ  ఆధిక్యంలో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 145 స్థానాలను దాటిన మహాయుతి.. ప్రస్తుతం 188 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, మహావికాస్ అఘాడీ కూటమి 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

మరోవైపు, జార్ఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 41 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుండటంతో జార్ఖండ్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, వయనాడ్ లో ప్రియాంక గాంధీ 60 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News