Friday, December 20, 2024

చివరికి క్షమాపణ చెప్పిన మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్

- Advertisement -
- Advertisement -

 

Supriya Sule and Chandrakanth Patil

ముంబై: ’పోయి ఇంట్లో వంటవండుకో’ అని ఎన్ సిపి నాయకురాలు సుప్రియను అన్నందుకు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చివరికి క్షమాపణ చెప్పినట్లు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలి చకంకర్ ఆదివారం తెలిపారు. తాము నోటీసు ఇవ్వడంతో ఆయన క్షమాపణ చెప్పినట్లు వివరించారు.

చంద్రకాంత్ పాటిల్ క్షమాపణ చెప్పిన తర్వాత సుప్రియా సూలే స్పందిస్తూ, ‘‘ నేను ఆయన అన్న ఆ రోజు నుంచే దుమారానికి దూరంగా ఉన్నాను. అయినా ఆయన పెద్ద మనస్సు చేసుకుని క్షమాపణ చెప్పారు. ఇంతటితో దీన్ని ఇక్కడే ఆపేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను’’ అన్నారు. దీనికి ముందు సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారంత్ ఖండించారు. భారత రాజకీయాల్లో లైంగికత్వ ధోరణి విపరీతం అవుతోందన్నారు. ఇక డిఎంకె ఎంపీ కనిమొళి అయితే పబ్లిక్ ప్లాట్ ఫారాల్లో మహిళలను కించపరచడానికి వ్యతిరేకంగా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇక వివరాల్లోకి వెళితే, చంద్రకాంత్ పాటిల్ బుధవారం ఓబిసి రిజర్వేషన్ అంశంపై నిరసన తెలుపుతున్నప్పుడు సుప్రియా సూలేను ఉద్దేశించి, ‘‘ నువ్వు(సూలే) రాజకీయాల్లో ఎందుకు ఉన్నావు. ఇంటికి పోయి వంట వండుకో. ఢిల్లీకన్నా వెళ్లు లేక స్మశానానికన్నా వెళ్లు. కానీ ఓబిసి  కోటాను తీసుకురా. లోక్ సభ సభ్యురాలివై ఉండి కూడా ఓ ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ పొందడం ఎలాగో తెలియదా? ’’ అని నిప్పులు చెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News