Monday, December 23, 2024

15మందితో మహారాష్ట్ర బిఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ

- Advertisement -
- Advertisement -
చైర్మన్‌గా అధినేత కెసిఆర్,
రాష్ట్ర శాఖ ఇన్‌చార్జిగా కె.వంశీధర్ రావు

హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ విస్తరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు. మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంఛా ర్జిగా కె.వంశీధర్‌రావును నియమించారు. అలాగే మరో 15 మందితో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఉండగా, 14 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు నేషనల్ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారీ పేరిట ఉత్తర్వు లు వెలువడ్డాయి. గత నెలలో మహారాష్ట్రలో 3 రోజులు పర్యటించిన కెసిఆర్ .. తాజాగా బిఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News