Wednesday, November 6, 2024

మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారు:కేటీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ప్రగతి కుంటుబడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తి హైదరాబాదేనన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి రాష్ట్రంలో సరైన ఆధారం ఉండేది కాదనీ, తమ ప్రభుత్వం వచ్చాక నీళ్లు, కరెంటు సదుపాయాలు కల్పించామని చెప్పారు. తాజ్ దక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, భూముల ధరలు పడిపోతాయని అన్నారని, కానీ ఇప్పుడు రైతులకు భూములే భరోసాగా మారాయని చెప్పారు. హైదరాబాద్ లో భూముల ధర పదినుంచి ఇరవై రెట్లు పెరిగిందని తెలిపారు. గత 65 ఏళ్లలో పాలకులు ఏం చేశారు, ఈ ఆరున్నరేళ్లలో తాము ఏం చేశామో చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అని అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతుల్లో పెడదామా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు చూసి మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడుల వల్ల అన్ని రంగాలూ అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News