Saturday, January 4, 2025

మహారాష్ట్రలో బస్సు ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ నాకా ఫ్లైఓవర్‌పై ఈ రోజు తెల్లవారుజామున 2.30కు రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యాత్రికులు బస్సులో అమర్‌నాథ్ యాత్ర నుంచి హంగోళీ జిల్లాకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. జూల్ 1న బుల్ధానా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Also Read: నగ్నంగా నిలబెట్టి…. మర్మాంగాన్ని కటింగ్ ప్లేయర్ తో నొక్కి….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News