- Advertisement -
సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫులే స్మారకాన్ని ఆమె జన్మస్థలం సతారా జిల్లా ఖాండ్లా తాలూకాలోని నయీగావ్ గ్రామంలో నిర్మించేందుకు మహారాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇందుకు బడ్జెట్‌లో రూ. 142.60 కోట్లను కూడా ఆమోదించింది. సావిత్రిబాయి ఫులే స్మారకం నిర్మాణం ప్రకటనను సిఎం కార్యాలయం ప్రకటించింది. ఇంతేకాక ఓ మహిళా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా రూ. 67.17 లక్షల గ్రాంట్‌ను కేటాయించారు. ఈ శిక్షణ కేంద్రం మహిళా సాధికారతకు ఉపయోగపడనున్నది.
- Advertisement -