Saturday, December 21, 2024

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పటోలే పాదాలు కడిగిన కార్యకర్త

- Advertisement -
- Advertisement -

అకోలా: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే పాదాలను పార్టీ కార్యకర్త ఒకరు పాదాలను కడుగుతున్నట్టు వైరల్ అయిన వీడియో వివాదాలను రేపుతోంది. పటోలే తన కారులో నుంచి దిగుతుండగా కార్యకర్త నీళ్లు తెచ్చి ఆయన పాదాలను తన చేతుల తోనే కడుగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

అకోలా జిల్లా వాడెగావ్ ప్రాంతంలో సోమవారం నానాపటోలే పర్యటిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీనిపై అధికార పార్టీ బీజేపీ ఆ పార్టీ కార్యకర్తలకు ఇది తీరని అవమానంగా విమర్శించింది. ఈ వివాదంపై పటోలే మాట్లాడుతూ గురు గజానన్ మహారాజ్ ప్రతీకాత్మక మైన పాదముద్రల ఊరేగింపులో పాల్గొన్న తరువాత తన పాదాలు బురదయ్యాయని, దగ్గరలో కొళాయి లేకపోవడంతో నీళ్లు తెమ్మని కార్యకర్తను కోరగా బాటిల్‌తో నీళ్లు తీసుకువచ్చారని వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బిజేపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రుణభారంతో కుంగిపోతున్న రైతులను ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించడం కర్తవ్యమైనప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పటోలేను టార్గెట్ చేసి ముంబై బీజేపీ ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. “ఇదేం దురదృష్టం.. ఎన్నికల్లో వినియోగించుకున్న కార్యకర్తలను కాంగ్రెస్ అదేపనిగా అవమానిస్తోందని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీలో అసలైన సంస్కృతి ఎక్కడ అని ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News