Wednesday, January 22, 2025

లింగమార్పిడితో తండ్రైన కానిస్టేబుల్..

- Advertisement -
- Advertisement -

మహిళా కానిస్టేబుల్ పురుషుడిగా మారి.. ఆ తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. అవును.. మీరు విన్నది నిజమే.. మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వే అనే మహిళ పురుషుడిగా మారింది. తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకుని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్ర బీడ్ ప్రాంతానికి చెందిన లలితా సాల్వే బాలికగానే పెరిగి పెద్దదయ్యారు. ఈ క్రమంలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి.. 2010 కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. అయితే, తన శరీరంలో మార్పులు వస్తుండడంతో 2013లో వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్ లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

లింగమార్పిడి చేయించుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. దీంతో 2018-2020 మధ్య కాలంలో మూడుసార్లు లింగమార్పిడి సర్జరీ చేయించుకుని పూర్తిగా పురుషుడిగా మారిపోయారు. తన పేరును కూడా లలిత్ గా మార్చుకున్నారు. ఆ తర్వాత 2020లో సీమ అనే యువతిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించారు. దీంతో లలిత్ ఆనందం వ్యక్తం చేస్తూ.. తాను స్త్రీ నుంచి పురుషునిగా మారి తండ్రయినందుకు తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News