Wednesday, January 22, 2025

కెసిఆర్ ప్రధాని.. సంకెళ్లతో మహారాష్ట్ర దంపతుల పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ప్రగతి భవన్‌కు సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్న మహారాష్ట్ర దంపతులు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. మహరాష్ట్రకు చెందిన చంద్రపూర్ జిల్లా రాజూరా ప్రాంతానికి చెందిన బాబూరావు, శోబామసే దంపతులు ఆపాద మస్తకం సంకెళ్లు ధరించి జూన్ 30న పాదయాత్రను ప్రారంభించి దాదాపు 500 కిలో మీటర్లు పాదయాత్ర చేసి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి గురువారం చేరుకున్నారు.ఈ నెల 21న హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు చేరుకుంటామని వారు తెలిపారు. దేశంలో కాంగ్రెస్,బిజేపి పాలనలో ప్రజలు నిర్భంధాన్ని చవి చూస్తున్నారని అందుకే తాము సంకెళ్లు ధరించి పాదయాత్ర చేస్తున్నామని,

తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రజారంజక పాలన చేస్తున్నారని ఆయన పాలన దేశానికి అంతటికీ కావాలని కోరుకుంటున్నామన్నారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వస్తున్న కెసిఆర్‌కు దేశ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకుడు, టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, వార్డుల ఇంచార్జీ మామిడాల కృష్ణ, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి,మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజ, ఎంవిసి మంచె శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ, ఎండి సత్తార్, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News