- Advertisement -
బెంగళూరు: కర్నాటక సరిహద్దులను, కన్నడ ప్రజలను పరిరక్షించడమే తమ ధ్యేయమని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, కాని మహారాష్ట్ర ప్రభుత్వమే రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తలను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
ఉభయ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడిగులనే కాక మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో నివసించే కన్నడ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో మహారాష్ట్రపై కర్నాటక ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -