Saturday, November 2, 2024

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

Maharashtra Dharmabad Sarpanch Support to BRS

బాసరలో 30మంది సర్పంచుల సమావేశం
త్వరలో ధర్మాబాద్‌లో కెసిఆర్‌తో సమావేశానికి సన్నాహాలు

భైంసా : భారత్ రాష్ట్ర సమితికి పక్కా రాష్ట్రమైన మహారాష్ట్రలో అప్పుడే ఆదరణ పెరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వీరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి పథకాలను చూసి గతంలోనే మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని పలు ప్రాంతాల వారు తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రాంతాలను విలీనం చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాబాద్ తాలుకాకు చెందిన దాదాపు 30 మంది సర్పంచ్‌లు బాసరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం కలకలం రేపింది. అక్కడ వివిధ పార్టీలలో కొనసాగుతున్నారు వీరంతా బీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునే అంశంపై సైతం విస్తృతంగా చర్చలు జరిపారు. ధర్మాబాద్ తాలుకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షడు నిదాన్‌కర్ లక్ష్మన్‌తో పాటు పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు హాజరయ్యారు. అంతేగాకుండా సర్పంచ్‌లంద రూ కలిసి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ధర్మాబాద్ పట్టణానికి ఆహ్వానం పలికేందుకు గాను ముమ్మరంగా చర్చించారు.

అవసరమైతే వారంతా తమ సర్పంచ్‌ల పదవులకు సైతం రాజీనామాలు చేసేందుకు సైతం సిద్దమైనట్లు తెలుస్తుంది. అంతేగాకుండా త్వరలో మహారాష్ట్రలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ధర్మాబాద్ మున్సిపాలిటిలో బీఆర్‌ఎస్ పార్టీపై పోటీ చేసేందుకు సైతం సిద్దమవుతున్నారు. బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ చేసిన ఏకగ్రీవ తీర్మాణ పత్రాన్ని వారంతా బీఆర్‌ఎస్ బాసర మండల అధ్యక్షుడు శ్యామ్‌కు అందజేయమేగాకుండా ఒక దశలో త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని పలు గ్రామాలు గత కొన్నేళ్లుగా అభివృద్ది కి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఈ ప్రాంతంలో ప్రజలు అన్ని రకాల లబ్దిపొందడాన్ని సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర ప్రజలు తరచూ చర్చించుకుంటున్నారు.

తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం వారిని విశేషంగా ఆకట్టుకుంటుందంటున్నారు. రైతుబంధు, రైత బీమాతో పా టు ఆసరా పెన్షన్లు సైతం వారి చర్చల్లో ప్రతిరో జు ప్రస్తావన వస్తుండడమేగాకుండా బీఆర్‌ఎస్ కు మద్దతు పలికి తామేందుకు సర్కారు పథకాల ను అందుకోవద్దన్న ఆలోచన వారిలో ఉందంటున్నారు. నిరుపేద ఆడ బిడ్డలకు అందిస్తున్న షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలతో తెలంగాణ లో ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా కొండంత అండ గా ఉండగా, ఎంతో కష్టపడి జీవనం సాగిస్తున్న తమకు ఇలాంటి పథకం అమలైతే ఎంతో మే లుంటుందన్న ఆశాభావంలో ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారడంతో ఇక్కడ ఆశించినంత అభివృద్ది జరగడం లేదని, ఎనిమిదేళ్లుగా సిఎంగా కెసిఆర్ ఉండడంతో అక్కడ అభివృద్ది రెట్టింపు అవుతుందని వారంతా తెలంగాణ వైపు చూస్తున్నారు. ఏది ఏమైనా వారం రోజుల క్రితమే ఏర్పాటైన బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ ఇక ఇతర రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోతుందనడానికి ఆదివారం బాసరలో మహారాష్ట్ర సర్పంచ్‌ల సమావేశమే నిదర్శనంగా పేర్కొనవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News