Friday, January 3, 2025

మహారాష్ట్ర ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన ఎన్ సిపి

- Advertisement -
- Advertisement -

బారామతి నుంచి పోటీచేయబోతున్న అజిత్ పవార్

ముంబై: భారతీయ జనతా పార్టీ, శివసేన తో పొత్తు పెట్టుకుని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్ సిపి) మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయబోతున్నది. ఎన్ సిపి అధినేత అజిత్ పవార్ బారామతి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఆ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 20న సింగిల్ ఫేస్ లో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

శివసేన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్న 45 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కోప్రీ-పచపఖడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 105 సీట్లు, శివసేన 56 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు  గెలుచుకున్నాయి.

మహా వికాస్ అఘాడి(ఎంవిఏ) ప్రధాన నాయకులు మంగళవారం ముంబైలో సమావేశమై సీట్ షేరింగ్ విషయాన్ని ఫైనలైజ్ చేశారు. మహా వికాస్ అఘాడిలో శివసేన(యుబిటి), ఎన్సీపి(ఎస్ పి), కాంగ్రెస్ ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News