Wednesday, January 1, 2025

గజ్వేల్ లో మహారాష్ట్ర రైతు బృందం పర్యటన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహారాష్ట్ర రైతు బృందం ఆదివారం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించింది. గజ్వేల్ అభివృద్ధిని చూసి బృందం సభ్యులు మంత్ర ముగ్థులయ్యారు. తెలంగాణ అభివృద్ధి అద్భుతం అంటూ ప్రశంసలు కరిపించారు. కళ్లు చెదిరే ప్రాజెక్టులు,  కాలువల నిండా పారుతున్న నీళ్లు, పచ్చని పంటపొలాలు చూసి మాకు నోట మాట రావడం లేదని మరాఠా రైతులు ఆశ్చర్య చకితులయ్యారు. గజ్వేల్‌లో మొదలైన అభివృద్ధి తెలంగాణ అంతా విస్తరించి ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ మాడల్ కావాలంటూ డిమాండ్ వినిపిస్తోందని మరాఠా రైతులు పేర్కొన్నారు.

ఇక్కడ రైతుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతోనే దేశానికి వ్యవసాయ విధానంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని మహారాష్ట్ర రైతులు అన్నారు. మహారాష్ట్రలో కూడా తెలంగాణ అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. పర్యటన అద్యంతం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కెసిఆర్ అంటూ నినాదాలతో మారుమోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News