- Advertisement -
చంద్రాపూర్: హిందీలో భారతమాత అనే పదాన్ని రాసేందుకు 65,724 మొక్కలను ఉపయోగించి మహారాష్ట్ర అటవీ శాఖ గన్నిస్ రికార్డును సాధించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరుగుతున్న మూడు రోజుల తడోబా ఉత్సవం సందర్భంగా ఈ ప్రపంచ రికార్డును అటవీ శాఖ సొంతం చేసుకుంది. హిందీలో భారతమాత అనే పదాన్ని రాయడానికి 26 రకాల 65,724 మొక్కలను అటవీ శాఖ ఉపయోగించిందని, తొలి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డును సాధించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలకుడు స్వప్నిల్ దాంగ్రికర్ తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మున్‌గంతివార్‌కు అంధారీ పులు అభయారణ్యంలో ఆయన సర్టిఫికెట్ అందచేశారు.
- Advertisement -