Wednesday, January 22, 2025

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి. పోలీసుల అలికిడి విన్న మావోలు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. హతమైన మావోయిస్టులు తెలంగాణ కమిటీకి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన మావోలలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో నుంచి ఎకె 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి, సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులలో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News